June 4, 2010

Telugu Kavithalu

గుండెల్లో దాగి  ఉంటె, అది గుర్తుండిపోయే  ప్రేమ 
కళ్ళలో  దాగి ఉంటె , అది కనుమరుగవని  ప్రేమ 
మనుసులో దాగి ఉంటె , అది మధురమైన ప్రేమ 
అదీ నా మనసులో ఉంటె , అది నిజమైన ప్రేమ ........

___________________________________________

మనుషుల మనసులు గెలవాలనుకున్నా 
ఆ మనుషులు నన్నే ఓడించాలనుకున్నా 
ప్రేమని అందరికి  పంచేయలనుకున్నా ...
ఆ ప్రేమ నా చెంతకి చేరకున్న....
మనుషులంతా ఒక్కటే అనుకున్న 
ఒక్కొకరి నడిచే దారే వేరైనా, వారి తీరే వేరైనా....
మంచిని పంచి మార్పుని తెద్దామనుకున్నా...
నన్నే అందరు మార్చలనుకున్నా...
అందరి కళ్ళలో ఆనందబాష్పాలు చూడాలనుకున్నా 
నాకే కన్నీరును  మిగులుస్తున్నా
అందరి తరవాతే నేననుకున్నా 
ఆ అందరు నన్ను వెనకకు తోస్తున్నా..
అందరిని  నవ్విన్చాలనుకుంటా... 
ఆకరికి నన్ను చూసి నవ్వేస్తున్న...
అందరి గమ్యం నేనవ్వాలనుకున్న 
వారి  గాయం నేనవుతున్నా......కన్నీటి బిందువునేనవుతున్నా.......... 
 
 
 
___________________________________________


ఒక స్త్రీ




కనురెప్పలు తెరిచిన క్షణం నుండి
ఎన్నో బందాలు కోసం
ఎనెన్నో బాధ్యతల కోసం

తన కుటుంబం కోసం

అందర్నీ కనుపాపల తలచి

తన భాదని మరిచి

ఆత్మీయతను పంచి

అయినవాలందరి కోసం

అవమానాలన్నీ సహించి

వారి కలల్ని పోషించి

వారి బావిష్యట్టు గురుంచి

అహర్నిశలు కష్టించి



తన జన్మాంతం శ్రమిస్తున్న ఆ స్త్రీకి ఇదే నా పాదాభివందనం ...
______________________________________________________




నీ కళ్ళ ఎదుట నిలిచిన రోజు మళ్ళి రావాలి
                                 నాకు మళ్ళి కావాలి....
నీతో మాట్లాడిన మొదటి క్షణం మళ్ళిరావాలి
                                   నాకు మళ్ళి కావాలి....
నీతో నడిచిన మొదటి పయనం మళ్ళి రావాలి
                                      నాకు మళ్ళి కావాలి.....
నాకు నువ్వు మెప్పించిన మనసు కావాలి...
నాలో నువ్వు సవరించిన వయసు కావాలి .....
నువ్వు మురిపించిన చనువు కావాలి ...
నువ్వు పరవశించిన నీ నవ్వు కావాలి ....
నన్ను తలపించిన నాకు నువ్వు కావాలి ...
______________________________________________________

“ విన్నవిన్చుకోలేను నాకున్న చిన్ని బాధను
దాచుకోలేను నాకున్న చిన్ని ఆనందాన్ని
బాధపడుతూవుంటా కాని నవ్విస్తూ ఉంటా
భయపెడుతూ ఉంటా మరి బయటెపడిపోతుంట
నవ్వే నా చిరునామనుకుంటా అందుకే
అందరికి తెలిపెస్తుంట అందర్నీ ఆహ్వానిస్తుంట....."
______________________________________________

“ కన్న కళలు నిజమవుతుంటే
కళలు కనడం ఆపలేను
నమ్మకం నాపై ఉంటె
వరాలేమి కోరలేను ….”
______________________________________________

“రేపటి కోసం చూడకు ఎవర్ని ఆశించకు
నీపై నమ్మకం ఉన్నంతవరకు వరాలు ఏమి కోరకు .
అడుగే ముందుకి వేసెయ్ నలుదిక్కులో చూసేయి
ప్రతి దిక్కున గెలుపే నీకై ఉదయిస్తుంది .....
అణువణువూ గాలించేయ్  నీలో సత్తా చాటెయ్
ప్రతి చోట గెలుపే నీకై ఎదురొస్తుంది."
______________________________________________


“కళ్ళలోనే దాచలేను కనీరైన కలలన్నిటిని 
గుండెలోనే ఆపలేను , కదులుతున్న అలలన్నిటిని 
నన్ను నేను మరిచిన బాదే నన్ను విడిచిన
గాయం మాసిపోవున!,కాలం తిరిగి వచ్చెన ..”
______________________________________________
“కళ్ళే తెరుచుకుంటే కన్నీరై కదులుతుంది
మనసే విప్పుతుంటే ముల్లై గుచ్చుతుంది .
నాతో పాటు నడిచే కాలం పరుగే పెడుతుంది
నా గమ్యం దూరమవుతుందా   ?
నా ప్రాణం మూగాబోతుందా  ?
ఇది సాగేదేన్నాలే ఇక ఆగేదేనాడే ?......”
______________________________________________
“నేను నేనుగా వుండలనుకున్నా 
అందుకే నీ వెనకే వచేస్తున్న
మనసులోని భావం తెలపాలనుకున్నా  .
తెలపడానికి మాటలు రాకున్న
నాల నన్ను నమ్మే తోడే నీవుగా .
నిత్యం నాతో నడిచే నీడే  నీవుగా…”
______________________________________________
“ఆశ పడితే తప్పు కాదు .
అది సొంతమైతే లక్కు కాదు
ఓడిపోతే మెప్పు రాదూ
వేచి చూస్తే గెలుపు రాదు ”
______________________________________________
Related Posts Plugin for WordPress, Blogger...